16-08-2025 06:43:59 PM
మోతె: శనివారం మండల బీసి సంఘం మండల అధ్యక్షులు అండెం లింగయ్య ఆధ్వర్యంలో మండల ఎస్ఐ అజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మాంచారు. అనంతరం లింగయ్య మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో యువత పెడదారులు పట్టకుండా డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా గ్రామాలలో శాంతి యుత వాతావరణంలో విద్యా అభివృద్ధికీ పాటు పడుతూ రాబోయే రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు క్రమం పద్దతిలో కొనసాగించి ఆ సాంఘిక చర్యలకు తావు లేకుండా యువత చక్కటి మార్గంలో నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరారు.