calender_icon.png 17 August, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగి పొర్లుతున్న కిష్టాపూర్ సమీప హల్ది వాగు..

16-08-2025 06:43:17 PM

తూప్రాన్ (విజయక్రాంతి): గత ఐదు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తూప్రాన్ పట్టణ సమీపంలో గల హల్దీ వాగు పొంగి పొర్లుతుంది. ఎగువ ప్రాంతాల నుండి భారీ వర్షపు నీరు వచ్చి చేరడంతో చెరువులు నిండి పారడంతో దిగవన హల్దీ వాగు తీరా ప్రాంతాల నీరు వాగులో కలవడంతో కిష్టాపూర్ సమీపంలో గల హల్ది వాగు ఆయా కట్ట పొంగిపొర్లుతుంది. భారీ వర్షాలు నేపథ్యంలో హల్ది పొంగి పోర్లుతుంది..

అలుగు పోస్తున్న మెడక చెరువు

తూప్రాన్ లోని మెడక చెరువు కురుస్తున్న వర్షాలకు గాను ఎగువ ప్రాంతాల నుండి కట్టు కాలువ రావడంతో మెడకచెరువు నిండి అలుగు పోస్తుంది. అలుగు పోసిన నీరు అనుసంధాన కట్టు కాలువ ద్వారా తూప్రాన్ లోని పెద్ద చెరువులోకి వర్షపు నీరు చేరుతుంది. సమీప గ్రామాలలోని పలు చెరువులలో భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి.

అలుగు పోయడానికి దరిదాపులో ఉన్న కొత్తచెరువు

తూప్రాన్ పట్టణ కేంద్రంలోని కొత్తచెరువు భారీ వర్షాల నేపథ్యంలో అలుగు పోయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసినట్లయితే మండలంలోని పలు గ్రామాల సమీప చెరువులు కుంటలు పూర్తిగా నిండి అలుగు పోస్తాయి.