30-12-2025 12:00:00 AM
మృతుడి భార్య స్రవంతికి రూ.76 వేల ఆర్థిక సహాయం
గోపాలపేట, డిసెంబర్ 29 : చిన్ననాటి నుండి వారందరూ ఒకే చోటపదవ తరగతి వరకు కలసి మెలసి విద్యను అభ్యసించారు. దురదృష్టవర్షాత్తు తోటి స్నేహితుడు కోల్పోవడంతో వెలలేని ఆవేదనలు చెందిన ఆ తోటి విద్యార్థులు స్నేహమంటే ఇదేరా అన్నట్టుగా వారి స్నేహ భావాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన ఆ పూర్వ విద్యార్థులు ఎవరో తెలుసా.. గోపాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తనతో పాటు చదువుకున్న తోటి స్నేహితుడు కిరణ్ కుమార్ 2025 సెప్టెంబర్ 16 న మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న కిరణ్ కుమార్ తోటి స్నేహితులంతా ఎంతో బాధపడి వారంతా కలసి చేయి చేయి కలిపి తోటి స్నేహితుడు మృతి చెందాడని వారి కుటుంబాన్ని ఏదో కొంత సహాయం చేసి ఆదుకుందామంటూ మా పదవ తరగతి పూర్వ విద్యార్థులంతా సోమవారం కిరణ్ కుమార్ భార్య స్రవంతిని పాఠశాల వద్దకు రప్పించి సుమారుగా 76 వేల రూపాయలను పూర్వ విద్యార్థులు భార్య స్రవంతి తండ్రి ఆంజనేయులుకు నగదు రూపంలో అందజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ పూర్వ విద్యార్థులను అభినందించారు.