calender_icon.png 23 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్త కుటుంబానికి రూ.26 వేల ఆర్థిక సహాయం

22-07-2025 06:22:11 PM

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి(సి) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కనకం తిరుపతి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవిందర్(BRS Party Mandal President Allam Ravinder) పార్టీ కార్యకర్తల సహాయంతో రూ.26 వేల నగదు, 50 కిలోల బియ్యాన్ని మృతిని కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా అల్లం రవీందర్ మాట్లాడుతూ... కనకం తిరుపతి పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసిన నమ్మకమైన కార్యకర్త అని, ఆయన మృతి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులంతా కలిసి మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, యూత్ మండలాధ్యక్షుడు తౌటం నవీన్, సీనియర్ నాయకులు బైరం భద్రయ్య, పాండ్రాల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.