calender_icon.png 4 August, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసికందుతో రాళ్ల దారిలో.. కాలినడకన బాలింత..

04-08-2025 12:00:00 AM

- వాగుపై వంతెన లేక ప్రమాదమని తెలిసినా...

-జిల్లా కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలోనే దుస్థితి... 

ఆదిలాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఆదిలాబాద్ జిల్లాలోని నేటికి పలు గ్రామాలకు రహదారులు లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి నిత్యం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి తమ పనులను పూర్తి చేసుకుంటున్న ప్రజలు నేటికీ జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

జిల్లా కేంద్రానికి కేవలం 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆదివాసి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారంటే, ఇక మారుమూ ల గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో చెప్పాల్సి న పనిలేదు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చిట్యాల బోరి గ్రామానికి వెళ్లాలంటే రెండు వాగు లు దాటాల్సి ఉంటుంది. దానికి తోడు సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డు లేక కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని పరిస్థితి ఉందంటే ఆ గ్రామస్తుల దుస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా అత్యవసర సమస్యల వస్తే ఇక వారి కష్టాలు అన్నీఇన్ని కావు.

వర్షాకాలంలోనైతే మరింత ఇబ్బందులు తప్పవు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆడ లక్ష్మీబా యి గర్భిణీ పురిటి నొప్పులతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె, రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. ఐతే నాలుగు రోజుల పసికందులు పట్టుకొని జిల్లా కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి బయలుదేరారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో వాగుపై వంతెన లేక ప్రమాదమని తెలిసినా పసికందును చేతిలో పట్టుకొని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వాగు దాటారు. గ్రామానికి చేరుకోవడానికి పచ్చి బాలింత సుమారు రెండు కిలోమీటర్ల మేర రాళ్ళురప్పలు దాటుతూ కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. 

కాలినడకన లేదంటే.. ఎడ్ల బండి

తమ గ్రామనికి వెళ్ళడానికి సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత కొన్నేళ్ళుగా పాలకులు పట్టించుకోవడంతో నేటికీ ఆసుప త్రులకు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. మా గ్రామానికి చేరుకోవడానికి కనీసం ద్విచక్ర వాహనంపై వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితిలో బయటకు రావాలం టే కాలినడకన లేదా ఎడ్ల బండి శరణ్యం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు పట్టించుకోని తమ గ్రామానికి రహదారి సౌక ర్యాన్ని కల్పించాలి.

 కుంర్ర వసంత్, మాజీ సర్పంచ్, చిట్యాల బోరి