calender_icon.png 15 January, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాణిగంజ్‌లో అగ్నిప్రమాదం

15-01-2026 02:51:01 AM

సికింద్రాబాద్ జనవరి 14 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ రాణిగంజ్ ప్రాంతంలోని బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాణిగంజ్ లో అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోదాం లో ఉన్న అగ్ని నివారణ పరికరాలు, వస్తువులు, సామాగ్రి అగ్ని ప్రమాద దాటికి పూర్తిగా ఆహుతయ్యాయి. పై అంతస్తులో ఉన్న పరిశ్రమల విడిభాగాల గోదాముకు సైతం మంటలు వ్యాపించినట్లు అగ్ని అగ్నిమాపక అధికారి ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలియ చేస్తూ,ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.రెండు అంతస్తులలో ఉన్న అగ్ని నివారించే పరికరాలు, చేతి తొడుగులు,నీటి యంత్రాలు, ఇతర సామగ్రి సమాజంలో పూర్తిగా దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలానికి రాంగోపాల్ పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర పరిస్థితి పరిశీలించారు.