21-11-2025 01:01:08 AM
ఘట్ కేసర్, నవంబర్ 20 : మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్ కేపాల్ వద్ద గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న పరుపులు, సోఫా సెట్ ల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు రేగి దట్టమైన పొగలతో ఆకాశమంత ఆవరించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అర్పించారు. ప్రమాదానికి కారణం, ఎంత నష్టం జరిగింది తెలియాల్సి ఉంది.