calender_icon.png 21 November, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో విషాదం.. యువకుడి మృతి

21-11-2025 01:00:39 AM

వేములవాడ టౌన్, నవంబర్ 20 (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు బద్ది పోచమ్మ ఆలయ కార్మికుడు తాను నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రెండవ బైపాస్ రహదారి పక్కనే ఉన్న మురికి కాలువలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.ద్విచక్ర వాహనం నేరుగా మురికి కాలువలోకి పడిపోవడంతో అభినవ్కు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు.ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు, అభినవ్ బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు..