calender_icon.png 19 November, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

18-11-2025 12:00:00 AM

అలంపూర్, నవంబర్ 17: బీసీలు సమాజంలో ఎదిగినప్పుడే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని అందులో భాగంగానే మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే విజయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం అల్లంపూర్ పరిధిలోని గుందిమల్ల, క్యాతూరు గ్రామాల సమీపంలో ఉన్న  కృష్ణానదిలో  చేప పిల్లల  విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి గాను 100 శాతం రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.