calender_icon.png 28 July, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారులు గోదావరికి చేపల వేటకు వెళ్లకూడదు

25-07-2025 12:40:41 AM

ములుగు జిల్లా మత్స్యశాఖ అధికారి టి సల్మాన్ రాజు

ములుగు, జూలై24 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో భారి నుండి అతి భారి వర్షపాతం నమోదు అయింది జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ములుగు గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరు కూడా గోదావరిలో చేపల వేటకు వేల్లకుడదని ములుగు జిల్లా మత్స్యశాఖ అధికారి టి సల్మాన్ రాజు ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈసందర్భంగా అయినా మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల నెం:186 /పశు సంవర్ధక శాఖ మత్స్యశాఖ తేది: 25/11/1995 ప్రకారము జూలై, ఆగష్టు మాసములలో చేపల వేట నిషిద్దము.

ఈ రెండు నెలలు చేపలు గ్రుడ్లు పెట్టి పిల్లలు చేయు తరుణము. కావున చేపలు వేటాడుట నిషిద్ధమైనది. ములుగు జిల్లాలోని మత్స్య సహకార సంఘ అద్యక్షులు, సంఘ సభ్యు లకు తెలియజేయునది ఏమనగా, జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మత్స్త్యకారులు ఎవరు జలాశయాలు, చెరు వులు, కుంటలు, వాగులలో చేపల వేటకు, ఈతకు వేల్లకుడదని తెలియపర్చుచు న్నాము.

మీ సంఘం పరిదిలోని ఉన్నచెరు వులు మత్తడి పోయుచున్నపుడు మత్తడి పోయు ప్రాంతములో ఎటువంటి సిమెంటు దిమ్మేలు,ఇనుప జాలీలు ,కర్రలు, వలలు పెట్టకూడదు. వీటిని ఏర్పరచడం వలన చెరువు కట్టలు, తెగిపోయే ప్రమాదము కలదు. ఒకవేళ ఏదైనా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం వారు,  మత్స్యకారులు గానీ అతిక్రమించినచో వారిపై చట్టపరమైన చర్యలు తిసుకుంటామని తెలిపారు.

-