calender_icon.png 19 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నడుద్దాం

19-08-2025 12:57:00 AM

 కడ్తాల, 18: బహుజన రాజ్యాధికారం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నడవాలని జిల్లా సీనియర్ నాయకులు అద్దాల రాములు పిలుపునిచ్చారు. సోమవారం కడ్తాల మండలంలోని సరికొండ గ్రామంలో సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఉత్సవా కమిటీ సభ్యులు లాలుకోట రాములు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువజన సంఘాల నాయకులు తరలివచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాసాని యాదయ్య, గులకుంట యాదయ్య, నర్సమ్మ, గౌని లక్ష్మయ్య నాయకులు అద్దాల యాదయ్య, లాల్ కోట నరసింహ, ఆలూరి నరసింహ, రౌతు వెంకటయ్య హరిచంద్ర, అద్దాల మహేందర్ గౌడ్, కొత్తపల్లి శ్రీరాములు, కాసాని ముచ్చo,మహేష్, వీర్లపల్లి మహేందర్, సాప శ్రీశైలం లు పాల్గొన్నారు.