calender_icon.png 9 July, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు బోనాల పండుగకు ఆహ్వానం

09-07-2025 12:00:00 AM

కామారెడ్డి, జూలై 8 (విజయ క్రాంతి) ః కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ బోనాల పండుగకు హాజరు కావాలని కోరుతూ మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి  చాముండేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

దోమకొండలో పెద్ద ఎత్తున జరిగే బోనాల పండుగకు  హాజరై తీర్థప్రసాదాలు  స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, అర్చకులు శరత్ చంద్ర, భాస్కర్, బిజెపి దోమకొండ మండల అధ్యక్షులు మద్దూరి భూపాల్ రెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్  కుంట లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.