calender_icon.png 23 November, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎన్‌జె ఆసుపత్రిలో అన్నదానం

23-11-2025 12:00:00 AM

డాక్టర్ ముజీబ్ నేతృత్వంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ(ముజీబ్), ఆసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా, సయ్యద్ అసదుద్దీన్, ట్రస్ట్ కోశాధికారితో కలిసి శనివారం ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు డాక్టర్ ముజీబ్ నేతృత్వంలో అన్నదానం చేశారు.

తన తల్లిదం డ్రులు ఆసదుద్దీన్, అన్వరున్నీసా జ్ఞాపకార్థం నెలకొల్పిన ఈ ట్రస్ట్ ద్వారా డాక్టర్ ముజీబ్ ప్రతి శనివారం లేదా వారం వారం నిరంతరాయంగా ఈ మహత్తరమైన సామాజిక సేవను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓ.ఎస్ యూనియన్ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో కుర్రాడి శ్రీనివాస్ (జిల్లా కార్యదర్శి), కె.ఆర్. రాజ్ కుమార్ (అసోసియేట్ ప్రెసిడెంట్) పాల్గొన్నారు.

యూనియన్ కార్యవర్గ సభ్యులలో చంద్రశేఖర్ (ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ కార్యదర్శి), రాజు (ఈ.ఎన్.టి. యూనిట్ అధ్యక్షుడు), రాజ్ కుమార్ (ఈ.ఎస్.ఐ. యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్, వాహిద్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ, ‘కష్టాల్లో ఉన్న వారికి సేవ చేయడం దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అన్నారు.