calender_icon.png 30 January, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐఎంసీ కాలేజీ డైరీ ఆవిష్కరణ

30-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఐఐఎంసీ కాలేజీ డైరీని గురువారం కళాశాలలోని చల్లా సోమ్ రాజ్ రామ్ సమావేశ మందిరంలో ప్రముఖ రచయిత నాగ సూరి వేణుగోపాల్ ఆవిష్కరించారు. సభాధ్యక్షులు కళాశాల చైర్మన్ విశ్వనాథం మాట్లా డుతూ 2010 నుంచి కళాశాల ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కళాశాల పూర్వ ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు మా ట్లాడుతూ.. ఈ డైరీలు పరిశోధన చేయడానికి ప్రాథమిక సమాచార సేకరణలో ఉప యోగపడుతాయని తెలిపారు.

నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తప స్సు, తపన రూపం దాల్చినప్పుడు దాని ఫలితం ఉంటుందని అదేవిధంగా ఈ డైరీ రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. డైరీ రూపకర్త, కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ.. 16 సంవత్సరాల నుండి నిరాటంకంగా కళాశాల డైరీని ప్రతి సంవత్సరం ఏదో ఒక ముఖ్య విషయంతో ఆవిష్కరిస్తున్నామని ఈ సంవత్సరం డైరీలో దేశం గర్వించదగ్గ సర్వోన్నత గణిత, సంఖ్యా క శాస్త్ర శాస్త్రవేత్తల, సాహిత్యకారుల జీవిత విశేషాల గురించి, చాణిక్య కోటషన్స్ పొందు పరచడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల డీన్లు డా సంతోషి, డా తిరుమలరావు, వివిధ విభాగాల అధ్యక్షులు, అధ్యాపకులు పాల్గొన్నారు.