calender_icon.png 2 August, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృభూమి రక్షణ కోసమే..

29-07-2025 12:05:57 AM

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘వార్2’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. యష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీధర్ రాఘవన్ కథను అందిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర కథా రచయిత శ్రీధర్ మాట్లాడుతూ.. “మాతృభూమి రక్షణ కోసం ప్రమాదకరమైన కోవర్ట్ ఆపరేషన్‌లోకి ఇద్దరు ఏజెంట్స్ అడుగుపెడతారు. అవసరమైతే దేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడరు.

దేశం కోసం పోరాడే ఇద్దరు ఏజెంట్లు ఒకరితో మరొకరు ఎందుకు తలపడాల్సి వచ్చిందన్నది సినిమాలో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అసలు ఈ ఇద్దరిలో నిజమైన ఏజెంట్ ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే అంశం థ్రిల్ పంచుతుంది. ” అని చెప్పారు. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, హిందీ భాషల్లో కానుంది.