08-07-2025 12:00:00 AM
పడవపై పాకిస్థాన్‌కు చెందిన గుర్తులు
రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్, పోలీసు ప్రత్యేక బృందాలు
రాయ్‌గఢ్, జూలై 7: మహారాష్ట్రలోని రా య్‌గఢ్ జిల్లాలోని సముద్రతీరాన ఒక విదే శీ బోటు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. రేవ్‌దండాలోని కొర్లాయ్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. సమాచారమందుకున్న రా య్‌గఢ్ పోలీసులు.. వందల మంది పోలీసులతో పాటు బాంబ్ స్కాడ్ డిటెక్షన్ బృందం తో అక్కడికి చేరుకున్నారు.
నేవీ, కోస్ట్‌గార్డ్ సి బ్బంది కూడా తీరానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా పడవపై పాకిస్థాన్‌కు చెంది న గుర్తులు ఉన్నాయని తెలుస్తోంది. బ హుశా అ ది తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
భారీ వర్షం, బలమైన ఈదురుగాలు కారణంగా పడవ ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు ఆటంకం ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో తీర ప్రాంతంతో పాటు రాయ్‌గఢ్ జిల్లా వ్యా ప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముం దుజాగ్రత్త చర్యగా తీరంలో భారీగా పోలీసులను మోహరించారు.
26/11 ఘటన నేపథ్యంలో భారీ భద్రత
ఈ పడవ ఏ దేశానికి చెందినది? ఏ మా ర్గంలో వచ్చిందన్న కోణాలపై భద్రతా సి బ్బంది దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘట న 26/11 దాడులను గుర్తు చేస్తుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. ఉగ్రకుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2008లో నవంబర్ 26న ముంబై లో భారీ ఉగ్రదాడి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.