calender_icon.png 27 September, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసెలను తొలగించిన అటవీ సిబ్బంది

27-09-2025 02:07:52 AM

జన్నారం(మంచిర్యాల), సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని కవ్వాల్ సెక్షన్ సోనాపూర్ తండా అటవీ బీట్ పాలగోరి ప్రాంతంలో రెండు నెలల కిందట ఆదివాసులు వేసుకున్న తొమ్మిది తాత్కాలిక గుడిసెలను తొలగించారు.

జన్నారం ఎఫ్డీఓ రాంమోహన్ ఆదేశాల మేరకు లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, తహశీల్దార్ రాజమనోహర్ రెడ్డి సమక్షంలో అటవీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం తొలగించి కర్రలను ట్రాక్టర్ల ద్వారా రేంజ్ కార్యాలయానికి తరలించారు.

ఈ కార్యక్రమంలో ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీధరచారి, స్థానిక ఎస్సు గొల్లపల్లి అనూష, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు సుష్మారావు, రత్నాకర్ రావు, అనిత, హఫీజోద్దీన్, 200 మంది అటవీ డిప్యూటీ రేంజు ఆఫీసర్లు, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.