calender_icon.png 2 December, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతగూటికి చేరిన కాంగ్రెస్ మాజీ నాయకులు

02-12-2025 12:00:00 AM

మహేశ్వరం, డిసెంబర్ 1 (విజయక్రాంతి ) : మహేశ్వరం మండలం ఉప్పు గడ్డ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు  మోహన్ నాయక్, రవి నాయక్ సోమ్లా నాయక్ లు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డి సమక్షంలో మండల మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నేనావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వతహాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దేపా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేసి,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొత్తగా చేరిన నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.

కందుకూరు, మహేశ్వరం మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకుంటా మని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ యూసుఫ్ ఖాద్రి ఆదివాసి కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంచిలాల్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, శ్రీను నాయక్, రవి నాయక్, మున్నా నాయక్, భరత్, సురేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.