02-01-2026 01:04:42 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 1(విజయక్రాంతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరింత ఉత్సాహంతో పని చేద్దామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ ఆర్డీవో నవీన్ ఆధ్వర్యంలో అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసే విషయంలో అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
ప్రజాప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో నవీన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మార్గదర్శకత్వంతో ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థంగా అమలు చేయడానికి కృషి చేస్తామని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు బి.శ్రీనివాసులు, ఘన్సీరాంనాయక్, నయాబ్ తహసీల్దార్లు దేవేందర్, శ్యాంసుందర్ రెడ్డి, ఆర్‌ఐ సుదర్శన్, సర్వేయర్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు