calender_icon.png 4 August, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

04-08-2025 12:46:47 AM

కామారెడ్డి, ఆగస్టు 3 (విజయ క్రాంతి), మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం పరామర్శించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మాజీ ఎంపీటీసీ గుర్రాల రవి తండ్రి గుర్రాల పెద్ద బాలయ్య అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, గంప గోవర్ధన్ బాధిత కుటుంబాన్నిపరామర్శించి ఓదార్చారు. తండ్రి లేని లోటు తీరని ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మనోధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలన్నారు. గుర్రాల పెద్ద బాలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడీశంకర్, జూకంటి మోహన్ రెడ్డి, శ్రీకాంత్, మచ్చ భాస్కర్, సింహం బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.