calender_icon.png 4 August, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

04-08-2025 12:46:36 AM

హనుమకొండ క్రైమ్, ఆగస్టు 3 (విజయక్రాంతి): హనుమకొండ నయీమ్ నగర్ లోని ఎస్సార్ హాస్టల్ భవనంలో ఆదివారం తెల్లవారుజామున ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మిట్టపల్లి శివాని గత కొద్ది రోజుల క్రితం హాస్టల్ భవనానికి చేరుకొని క్లాసులు వింటుందనీ కళాశాల నిర్వాహకులు తెలిపారు.

కోచింగ్ పేరిట మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. హత్య, ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్లు సిఐ శివకుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు వరంగల్ ఎంజీఎం కు తరలించారు.