calender_icon.png 17 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుగ్లక్ సేనలను ఉరికిచ్చిన కాకతీయ సైన్యం

17-08-2025 12:46:27 AM

ఓరుగల్లు సామ్రాజ్యం అపార ధనరాశులు, అష్టుశ్యైర్యాలతో తులతూగుతూ ఉండేది. ఓరు గల్లు పాలకులు రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచ డం మాత్రమే కాకుండా.. దండయాత్రల పేరు తో దాడులు చేసే వారిని కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. కొంత కాలం గడిచిన తర్వాత ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్న అపార సంపదను దోచు కెళ్లారు. ఢిల్లీ సుల్తానుల్లో మరీ ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు. ఖిల్జీ తెగకు చెందిన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ (మాలిక్ ఫిరోజ్) మొదట ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో వివిధ హోదాల్లో విధు లు నిర్వర్తించాడు.

క్రీ. శ 1290లో ఢిల్లీ సుల్తా నుల వారసులను చంపి ఢిల్లీకి చక్రవర్తి అ య్యాడు. అలా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి భా రత దేశంలో ఖిల్జీ పాలనకు పునాదులు వేశా డు. క్రీ. శ 1296లో జలాలుద్దీన్ అల్లుడైన అల్లావు ద్దీన్ ఖిల్జీ మామ జలాలుద్దీన్‌ను అం తమొం దించి తనను తాను ఢిల్లీ సుల్తానుగా ప్రక టించుకున్నాడు. అల్లావుద్దీన్ సుల్తాన్ అయిన అనంతరం అనేక దండయాత్రలు చేసి ఉత్తర భారతంపై తన జెండా ఎగరేశాడు. ఇక దక్షిణ భారతాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకో వాలని ఉవ్విళ్లూరాడు. అనుకున్నదే తడవుగా దక్షిణాదిపై దండెత్తి తన విజయపరంపరను కొనసాగించాడు. 

దక్షిణాదిపై దండెత్తిన తొలి ముస్లిం రాజు

ముస్లిం రాజులెవరూ అప్పటి వరకు దక్షిణాదిపై దండయాత్రలు చేయలేదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వారు ఉత్తరాదికే పరిమితం అయ్యారు. తొలిసారిగా అల్లావు ద్దీన్ ఖిల్జీ వింధ్య పర్వతాలు దాటి దక్షిణాదిలో అడుగుపెట్టాడు. ఆ సమయానికి దక్షిణాదిలో దేవగిరి, హోయసాల, కాకతీయ సామ్రాజ్యా లు వర్ధిల్లుతున్నాయి. దీంతో ఖిల్జీ కన్ను కాకతీయ సామ్రాజ్యంపై పడింది. క్రీ. శ 1303లో ఖిల్జీ కాకతీయులపైకి దండయాత్రకు వచ్చాడు. మాలిక్ ఫక్రుద్దీన్ జునా, ఝాజా అనే సైన్యాధికారుల నాయకత్వంలో ఖిల్జీ సేన లు కాకతీయులపై కాలు దువ్వాయి. ఇదే తురు ష్కుల మొదటి దండయాత్ర. ఆ యుద్ధంల  ఓరుగల్లు సేనలు, ఖిల్జీ సేనల్ని మట్టి కరిపిం చాయి. ఉప్పరపల్లి వద్ద ఖిల్జీ సేనల్ని ఓడించి తరిమికొట్టాయి. 

ఖిల్జీకి తొలి పరాజయం.. 

ఓటమన్నదే లేకుండా కొనసాగుతున్న ఖిల్జీకి కాకతీయులు ఓటమి రుచి చూపించా రు. ఖిల్జీ సేనల ఓటమికి రేచర్చ ప్రసాదిత్యుడి కుమారుడు వెన్నమ కారణం అని ‘వెలుగోటి వంశావళి’లో పేర్కొన్నారు. 

ప్రజల బాధలు చూడలేక.. 

కాకతీయ సైన్యానికి, ఖిల్జీ సేనలకు భీకర యుద్ధం జరుగుతోంది. 25 రోజులుగా యు ద్ధం అలాగే కొనసాగుతుండటంతో యుద్ధం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్‌కి అపార ధనరాశులు, ఏనుగులు ఇచ్చి సంధి చేసుకు న్నాడు. వారు అడిగినంత కప్పం చెల్లించి అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతుడిగా మారిపో యాడు. ఖిల్జీని సార్వభౌముడిగా గుర్తించాడు.  

తప్పుగా భావించిన సామంతరాజులు

ముస్లిం సైన్యం చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోవడంతో ప్రతాపరుద్రుడు బలహీన ప డ్డాడని తప్పుగా భావించిన కొంత మంది సా మంత రాజులు తిరుగుబాటు చేశారు. దాడి చేసిన మల్లిదేవుడి పైకి ప్రతాపరుద్రుడు గొంక య రెడ్డి నాయకత్వంలో సేనలను పంపాడు. గొంకయ రెడ్డి మల్లిదేవుడిని ఓడించడమే కా కుండా హతమార్చాడు. దాంతో ప్రతాపరు ద్రుడు గొంకయ రెడ్డిని ఆ ప్రాంత పాలకుడిగా నియమించి సత్కరించాడు. వరుసగా దండ యాత్రలు, ఢిల్లీ సుల్తానులకు కప్పం చెల్లించా ల్సి రావడంతో ప్రతాపరుద్రుడి సారధ్యంలోని కాకతీయుల ఖజానా ఖాళీ అయింది.

అనేక ప్ర యత్నాల తర్వాత రాజ్య ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ఇలా ఉండగా క్రీ. శ 1316లో అల్లావు ద్దీన్ ఖిల్జీ మరణిస్తాడు. ఖిల్జీ మరణించిన తర్వా త ఢిల్లీ సింహాసనంపై ఆధిపత్యం కోసం అనేక మంది కొట్టుకుంటారు. ఖిల్జీ మూడో కుమారు డైన ముబారక్ షా చివరికి సింహాసనాన్ని అధి ష్టిస్తాడు. ఇదే అదనుగా భావించిన ప్రతాప రుద్రుడు కప్పం కట్టడం మానేస్తాడు. దీంతో ఆగ్రహించిన ముబారక్ షా మరోమారు ప్రతా పరుద్రునిపై దండెత్తుతాడు. ఇలా ఢిల్లీ సుల్తా నులు ఓరుగల్లుపై దండయాత్రలు చేస్తూ కాకతీయుల చేత కప్పం కట్టించుకుంటూ ఉం టారు.

1320లో ఘియాజుద్దీన్ తుగ్లక్ షా ఢిల్లీ సింహాసనం అధిష్టిస్తాడు. ఓ పుకారుతో ము స్లిం సేనలు పారిపోతుంటే కాకతీయులు వారి ని ఉరికిచ్చుకుంట కోటగిరి దాకా తరిమేశారు. అది సరిపోని మహ్మద్ బిన్ తుగ్లక్ 1323లో మరోసారి ఓరుగల్లుపై దండెత్తుతాడు. అది ఊహించని ప్రతాపరు ద్రుడు అయిదు నెలలు అతికష్టం మీద కోటను కాపాడి.. లొంగిపోతా డు. ముస్లిం సైనికులు ప్రతాపరుద్రుడిని బందించి ఢిల్లీకి పంపగా.. అక్కడ ముస్లింల అవమానాలను భరించలేక ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా డు. ప్రతాపరు ద్రుడు మరణించడంతో కాకతీయ సామ్రా జ్యం ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో భాగంగా మారిపోయింది.