02-09-2025 12:27:21 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 1:ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని త క్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కే.హై మావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్ర జావాణి కార్యక్రమానికి జిల్లాలోని ప్రజల నుండి 174 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు విశ్వాసంతో సమర్పిస్తున్న అర్జీలను ప్రతి శాఖ అధికారి ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు తీ సుకోవాలని సూచించారు.
డెంగ్యూ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి డెం గ్యూ నియంత్రణకు డోర్ టు డోర్ అవగాహన, ఫీవర్ సర్వేలు, బ్లడ్ క్యాంపులు, డ్రైడే, ఫ్యాగింగ్ నిర్వహించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.వర్షాల కారణంగా చెరు వు కట్టలను పరిశీలించి గండ్లు పడే ప్రమా దం ఉన్న చోట ఇసుక సంచులు సిద్ధంగా ఉంచాలని సంబధిత అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో ప్రతి ఉద్యోగి ఒ క మొక్క నాటి సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఆదేశించారు.