02-01-2026 12:57:27 AM
మాగనూరు జనవరి 1. గత నెల 17న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మాగనూరు మండలం నేరడగమ్ము గ్రామానికి చెందిన దాసరి వెంకటమ్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన దాసరి వెంకటమ్మను గురువారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన గృహంలో సర్పంచ్ దాసరి వెంకటమ్మను శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సమన్వయంతో గ్రామా అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహ గౌడ్, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఎల్ల లింగమ్మ, దాసరి బాబు, ఈశ్వర్ యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు.