calender_icon.png 2 January, 2026 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలిండియా టోర్నమెంట్‌కు వెళ్లిన పీయూ క్రీడాకారులు

02-01-2026 01:01:07 AM

పాలమూరు యూనివర్సిటీ, జనవరి 1:  అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించేటటువంటి సౌత్ జోన్, ఆల్ ఇండియా టోర్నమెంట్లో భాగంగా పాలమూరు యూనివర్సిటీ సెటిల్ బ్యాట్మెంటన్ పురుషుల టీం క్లిఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ లో జనవరి 3 నుండి 6 వరకు నిర్వహిస్తున్న సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు.

ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ గారు క్రీడాకారులకు మరియు కోచ్ లకు క్రీడా దుస్తులు అందించి పాలమూరు యూనివర్సిటీ తరఫున ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల్లో ఉన్నతంగా రాణిస్తూ పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి క్రీడా సదుపాయలను సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీకి ఒక గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై శ్రీనివాసులు, కోచ్ డాక్టర్ అరుణ్, ప్రొఫెసర్ సత్య భాస్కర్ రెడ్డి, డాక్టర్ రజిని యుగంధర్ ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.