03-11-2025 09:34:39 PM
టిఆర్జిపిఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల నరసింహులు
సిద్దిపేట: తెలంగాణ సాంఘిక సంక్షేమ జమ్మికుంట బాలురు గురుకుల పాఠశాల కళాశాల లోని విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు.. వచ్చిన తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టి ఆర్ జి పి ఏ రాష్ట్ర నాయకుడు దార మధును గేట్ వద్ద అడ్డుకుని, గురుకులలోకి ప్రవేశం నిరాకరించి దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ తీరును తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, భోజనం, భద్రత హాస్టల్ పరిస్థితులను పర్యవేక్షించడానికి నాయకులు వస్తారు. వారిని అడ్డుకోవడం అనేది కేవలం విధి లంఘన మాత్రమే కాదు విద్యార్థుల సంక్షేమాన్ని అవమానించే చర్య కూడా..
ఈ సందర్భంగా టి ఆర్ జి పి ఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల నరసింహులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత ప్రిన్సిపాల్ పై తక్షణమే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల పాఠశాల కళాశాలల్లో పేరెంట్స్ కమిటిస్ సందర్శనను గురుకులాల సొసైటి కార్యదర్శిలు అధికారికంగా అనుమతించి, ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు వెంటనే జారీ చేయాలి. పిల్లల పట్ల నిర్లక్ష్యం, పేరెంట్స్ వాయిస్ ను అడ్డుకోవడం విద్యార్థుల హక్కులు, భద్రత, సంక్షేమాన్ని కాపాడటంలో టి ఆర్ జి పి ఏ కఠినంగా నిలబడుతుందని పేర్కొన్నారు.