calender_icon.png 4 November, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన భూమికి హద్దులు చూపించి రక్షణ కల్పించాలి

03-11-2025 10:12:44 PM

గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాగా ఎన్ని రోజులు నటిస్తారు

పాపాత్ములను మా ప్రభువే శిక్షిస్తారు

విలేకరుల సమావేశంలో మంథని నియోజకవర్గ పాస్టర్స్ సహవాసం కార్యదర్శి కె. అశోక్

మంథని (విజయక్రాంతి): మంథనిలో క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన భూమికి హద్దులు చూపించి రక్షణ కల్పించాలని, గతంలో ప్రభుత్వం క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన 314 సర్వే నెంబర్ లోని 34 గుంటల భూమికి రక్షణ కల్పించాలని మంథని నియోజకవర్గ పాస్టర్స్ సహవాసం కార్యదర్శి కె. అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన భూమిపై మంథనికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆ పోస్టులో క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ చేసిన వ్యక్తి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం వెళ్తామన్నారు. మంథనిలో బెస్త కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మత పెద్దగా ఉంటూ ఎంతో ఉన్నతమైన వృత్తిని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అ వ్యక్తికి వత్తాసు పలకడం దౌర్భాగ్యం అన్నారు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాగా వ్యవహరించే అతన్ని క్రైస్తవ సంఘానికి దూరం పెట్టాలని క్రైస్తవ సమాజాన్ని ఈ సందర్భంగా కోరారు. రాబోయే రోజుల్లో ఆ ఏసుప్రభు వారికి గుణపాఠం చెప్తాడని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు ఐ. డేవిడ్, ఉపాధ్యక్షులు ఎస్. జయరాజ్, సహాయ కార్యదర్శి పి. జోషి, కోశాధికారి ఏ. దైవ కృపాకర్, సభ్యులు ఎం. నవీన్, సిహెచ్ సుదర్శన్, కే జోసఫ్, వి. డేవిడ్, ఎల్. ప్రభాకర్ రాజు, ఎం. జాకర్యా, జె. రాజకుమార్ లు పాల్గొన్నారు.