28-07-2025 12:07:43 AM
వలిగొండ,జూలై 27 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని కంచనపల్లి బిఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పెద్దిటి సత్తిరెడ్డి కుమారుడు నాగవేందర్ రెడ్డి-పవిత్రల వివాహానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు డేగల పాండు యాదవ్, పడమటి మమతా రెడ్డి, గంగారం రమేష్, కోమిరెల్లి బాలకృష్ణారెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, జంగయ్య, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.