calender_icon.png 28 July, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గ్రామాలకు రహదారుల గోస

28-07-2025 12:08:34 AM

- భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు

- కాలినడకే దిక్కు

బెజ్జూర్, జులై 27(విజయ క్రాంతి): గిరిజ న గ్రామాల ప్రజలకు రహదారుల గోస తప్పడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని కోయపల్లి, మొగవెల్లి,నాగపల్లి తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాలేని పరిస్థితిగా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంక లు, ఉప్పొంగాయి.

భారీ వరద ప్రవాహానికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.  గిరిజన పల్లె ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్న  వాహనాలు సైతం బయటికి వెళ్లలేని పరిస్థితిగా మారింది. ఆ గిరిజన పల్లె ప్రజలకు ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ దేవుడే దిక్కు.

గతంలో రోడ్డు మంజూ రైనప్పటికీ అటవీ శాఖ అనుమతులు లేక రోడ్డు పనులు సైతం కంకర పోసి నిలిపివేశారు. ప్రభుత్వాలు మారిన, నాయకులు మారిన పేద ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో మహారాష్ట్రకు వెళ్లే వ్యాపారులు ప్రజలు సైతం వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అనుచరులు... 

మండలంలోని గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ వర్షాకాలం వచ్చిందంటే చాలు బురదమయంగా గుంతల మయంగా రోడ్ల న్నీ కొట్టుకుపోయి గిరిజన ప్రజలు నానా తండాలు పడాల్సిన పరిస్థితిగా మారుతుంది. భారీ వర్షం కురిసినట్లయితే ఓర్రెలు ఊపొంగి ప్రజలకు రాకపోకలు స్తంభిస్తాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి గిరిజన గ్రామా ల ప్రజల రవాణా సౌకర్యం చేయాలని కోరుతున్నారు.