calender_icon.png 27 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల జోక్యం లేకుండా ఇసుక రవాణా!

27-08-2025 01:37:02 AM

- జోగిపేట చౌరస్తాలో ఇసుక బజార్ ప్రారంభం 

- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ

సంగారెడ్డి, ఆగస్టు 26(విజయక్రాంతి): దళారుల జోక్యం లేకుండా నాణ్యమైన ఇసుక ను ఇందిరమ్మ లబ్దిదారులకు అందించడాని కే ఇసుక బజార్ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సిం హ్మ తెలిపారు. మంగళవారం ఆందోల్ ని యోజకవర్గం సంగుపేట జోగిపేట చౌరస్తా లో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన్య కర్తవ్యమన్నా రు. దళారుల బెడద లేకుండా, పారదర్శక పద్ధతిలో, నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం సాండ్ బజార్లను ఏర్పా టు చేయడం జరిగిందని అన్నారు. ఇసుక తరలింపు వాహనాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రతి 20 కి లోమీటర్ల పరిధిలో సాండ్ బజార్లు, ఆందో ల్ నియోజకవర్గం సహా జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో ఒక సాండ్ బజార్ ఉం డేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

దీని వలన ప్రజలు తక్కువ దూరంలోనే అవసరమైన ఇసుకను సులభంగా పొందగలరని ఆ యన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం, ముఖ్యం గా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎటువం టి ఇబ్బందులు కలగకుండా చూడటమే ల క్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక సరఫరా ప్రక్రియలో ఎవరైనా దళారుల మాదిరి గా వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు.

మైనింగ్ కా ర్పొరేషన్, రెవెన్యూ, హౌసింగ్, పోలీస్ శాఖ ల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇ సుక సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీజీఎండిసి ఎండి భవేష్ మిశ్రా, జిల్లా అదనపు  కలె క్టర్ చంద్రశేఖర్, జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మోహన్ రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, హౌసింగ్, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.