19-08-2025 12:48:40 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఇల్లెందు/టేకులపల్లి, ఆగస్టు 18, (విజయక్రాంతి):ఇల్లందు నియోజకవర్గంలో సోమ వారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రెవె న్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స రెడ్డి విస్తృతంగా పర్యటించి, 22 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఇ ల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎ మ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.
టే కులపల్లి మండల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న కోక్యా తండా నుండి పాత తడికలపూడి వరకు 1.25 కోట్ల రూపాయలతో బీటీ రహదారి, తావుర్యా తండా నుం చి కోక్యా తండా వరకు రూ.1.45 కోట్లలతో బీటీ రహదారి, థవుర్యా తండా నుండి పాత తడికలపూడి వరకు లక్ష్మీపురం వద్ద రూ. 83 లక్షల వ్యయంతో స్లాబ్ కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పాతతండా నుండి రాంపురం వరకు రూ.2.5 కోట్లతో హై లెవల్ వంతెన నిర్మాణా నికి, పేట్రంచేలక వద్ద రూ.రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి, కిష్టారం గ్రా మంలో పీఆర్ రోడ్ నుంచి స్మశానవాటిక వర కు హై లెవల్ వంతెన నిర్మాణానికి రూ. మూడు కోట్లతో నిర్మాణంతో చేపట్టనున్న ప నులకు శంకుస్థాపన చేశారు.
ఇల్లందు మం డల పరిధిలో మొండికుంట నుండి రామచంద్రాపురం రహదారిపై వాగు వద్ద రూ. ఆరు కోట్లతో నిర్మించనున్న హై లెవల్ వం తెన, ఇల్లందు పట్టణంలోని జె.కె. కాలనీలో 1.56 కోట్లతో మినీ స్టేడియం అభివృద్ధి ప నులు మరియు సౌకర్యాల కల్పనకు పనుల కు, శంకుస్థాపన చేశారు. రహదారులు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో ఇ ల్లందు మండలంలోని లలితాపురం గ్రామం లో ఖమ్మం_యెల్లందు రహదారి విస్తరణ, డి వైడర్లు మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు రూ.3.5 కోట్ల వ్యయంతో పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భం గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కి కట్టుబడి ఉందని, ముఖ్యంగా రహదారు లు, వంతెనలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రజలకు శాశ్వత సౌకర్యాలు అందించడమే ప్ర భుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని, ఈ దిశగా రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇ స్తోందని తెలిపారు. జిల్లాలో రాబోయే రో జుల్లో మరిన్ని అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాలు అమలులోకి రాబోతున్నాయని మం త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి శాఖ ఈ ఈ వెంక టేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు మరియు తదితరులుపాల్గొన్నారు.