calender_icon.png 19 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి

19-08-2025 12:47:00 AM

- గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల ఏర్పాటు కొరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి

- ఎస్పి రోహిత్ రాజ్ 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18, (విజయక్రాంతి):జిల్లాలో గణేష్ మండపాల ని ర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్‌https://policeportal.tspolice.gov.in/నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన స మాచారం కొరకు మాత్రమేనని, ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా భద్రత , పోలీస్ బందోబ స్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటన పోలీసు శాఖ ఆన్లైన్ ద్వా రానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తరువాతనే వినాయక మం డపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్ర తి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గణేష్ ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలు:

గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.ప్రతీ మండపం వద్ద త ప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లి. నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి.గణేష్ మండపాలు ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ నకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం యజమాని మరియు సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.మండపాల కమి టీ వివరాలు,బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పా టు చేయాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.మండపాల్లో , శోభాయాత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు.

మండపం వద్ద 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్య లు తీసుకోవాలి.భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించుకోవాలి.అగ్ని ప్ర మాదం సంభవించిన ప్పుడు ముందు జా గ్రత్త చర్యలలో భాగంగా దగ్గరలో ఇసుక , నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం,అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు/పాటలు పూర్తిగా నిషేధం. మండపం వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి,విధిగా పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.

 అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు,వస్తువులు,వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పో లీసులకు సమాచారం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదని,ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత పో లీసు అధికారులను, 100 నంబర్ను సంప్రదించాలని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారుసూచించారు.