calender_icon.png 30 January, 2026 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు సైబర్ కేటుగాళ్ల అరెస్ట్

29-01-2026 12:00:00 AM

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన నిందితులు

అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ గుట్టురట్టు చేసిన పోలీసులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన కేసులో హైదరబాద్ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అధిక లాభాల ఆశచూపి లక్ష్మీనారాయణ భార్య నుంచి ఏకంగా రూ. 2.58 కోట్లు సైబర్ నేరగాళ్ల ముఠా కొట్టేసింది. ఈ భారీ మోసంపై రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.అత్యధిక లాభాలు గడించవచ్చని నమ్మించి నిందితులు ఈ మోసానికి తెరలేపారు. తొలుత వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా బాధితురాలికి మెసేజ్‌లు పంపిన కేటుగాళ్లు.. తాము ప్రము ఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్స్ ప్రతినిధులమని నమ్మబలికారు.

వారి సూచనల మేరకు ఒక నకిలీ ట్రేడింగ్ యాప్ లో ఆమె పెట్టుబడి పెట్టారు. ప్రారంభంలో బాధితురాలికి లాభం వచ్చినట్లు డిజిటల్ స్క్రీన్లపై చూపించి ఆమె నమ్మకాన్ని చూరగొన్నారు. మరింత ఎక్కువ పెట్టుబడి పెడితే కోట్లలో సంపాదించవచ్చని ఆశ చూపడంతో, ఆమె విడతల వారీగా వివిధ బ్యాంక్ ఖాతాలకు సుమారు రూ. 2.58 కోట్లు బది లీ చేశారు. తీరా నగదు విత్‌డ్రా చేసుకునే సమయానికి సాంకేతిక సమస్యలంటూ నిం దితులు తప్పించుకోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీ సులను ఆశ్రయించారు. బాధితు రాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ విభాగం సాంకేతిక ఆధా రాల సాయంతో విచారణ చేపట్టింది. నిందితులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించి,  దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.