calender_icon.png 30 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కకాటు ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్

29-01-2026 12:00:00 AM

బల్దియాకు నోటీసులు..

షర్విపై దాడి ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్ 

ఫిబ్రవరి 24లోగా నివేదిక ఆదేశం 

చిన్నారికి రెయిన్‌బోలో సర్జరీ  

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): నగరంలోని ఖైరతాబాద్‌లో మైనర్ బాలిక షర్విపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఉదంతంపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ జుడీషియల్ సభ్యురాలు శివాడి ప్రవీణ బుధవారం సుమో టోగా విచారణ స్వీకరించారు. ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కమిషన్ ఆదేశించింది.

ఈ ఘటన ఎందుకు జరిగింది..బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు ఏమిటి.. నగరంలో వీధి కుక్కల బెడదను నివారించడానికి అమలు చేస్తున్న నివారణ చర్యల వివరాలను నివేదికలో పొందుపరచాలని కమిషన్ స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తూ, ఆలోపు పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

చిన్నారికి సర్జరీ.. నిలకడగా ఆరోగ్యం..

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి షర్విని కుటుంబ సభ్యులు నగరంలోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత దష్ట్యా వైద్యులు బాలికకు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుం టోందని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బల్దియా అధికారులు ఆసుపత్రికి వెళ్లి బాలిక పరిస్థితి ని పర్యవేక్షించడమే కాకుండా, కమిషనర్‌కు ప్రాథమిక నివేదికను సమర్పిం చారు. స్థానికుల ఆందోళన నేపథ్యం లో బల్దియా వెటర్నరీ  విభాగం అధికారులు రంగంలోకి దిగారు. ఖైరతా బాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృం దాలు గాలింపు చేపట్టి, 17 వీధి కుక్కలను పట్టుకున్నాయి. వాటిని బల్దియా కు చెందిన షెల్టర్ హోమ్‌లకు తరలించినట్లు అధికారులు తెలిపారు.