12-09-2025 01:22:34 AM
దూరవిద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మ నాయక్
నల్గొండ రూరల్ సెప్టెంబర్11 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దురవిద్య కేంద్రంలో ట్రాన్స్ జెండర్ లకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ అన్నారు.గురు వారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే విధంగా , గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైఫండ్ ఆధారిత విద్యా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అప్రెంటిస్షిప్ ల చదువుతోపాటు, గ్రామీణ, గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రతి సంవత్సరం 5000 మంది గ్రామీణ గిరిజన విద్యార్థులకు ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు.గోండు కోయ, చెంచు ఆదివాసులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించామన్నారు.
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూరవిద్య కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చి చదువుకునే దశలోనే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చిందని, సమాజంలోని అన్ని వర్గాలకు సమత, నిపుణ ఫెలోషిప్లు అందుబాటులో ఉందన్నారు. దూరవిద్య రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మాట్లాడుతూ,
ఈ కేంద్రంలో బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు కొనసాగుతున్నాయని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సంవత్సరానికి 5000 పైచిలుకు అడ్మిషన్ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, అందుకు అన్ని కళాశాలలో కోఆర్డినేటర్లు మరియు కౌన్సిలర్లు సహకారం అందించి అందించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే శ్రీనివాస రాజు మాట్లాడుతూ,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా దూరవిద్య అధ్యయన కేంద్రం విద్యార్థినులకు అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కౌన్సిలర్లు నగేష్, పద్మ, విజయ,ఉస్మాన్ భాష, నరేందర్, రామ్ రెడ్డి, మల్లికార్జున్,వీరన్న,ధనుజ తదితరులు పాల్గొన్నారు.