calender_icon.png 12 September, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

12-09-2025 01:23:59 AM

దేవరకొండ ఎమ్మెల్యే  బాలు నాయక్

దేవరకొండ,సెప్టెంబర్ 11: దేవరకొండ పట్టణ కేంద్రంలో  మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా గురువారం 5వ వార్డులో ఎమ్మెల్యే బాలు నాయక్  అధికారులతో కలసి పట్టణ ప్రజలకు నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో అన్ని వార్డులలో నూతనంగా సీసీ రోడ్ల, అండర్ డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని, ఇండ్లు మంజూరు కానీ నిరుపేదలు ఎవరు ఆందోళన చెందవద్దని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా మాజీ ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.