calender_icon.png 15 August, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మెడికవర్’లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

15-08-2025 01:48:25 AM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేటి నుంచి 31 వరకు నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): 79వ స్వాతాంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 31 వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, హైటెక్‌సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో నిపుణ వైద్యులు సేవలు అందించనున్నారు.

ఈ శిబిరంలో మమ్మోగ్రఫీ (రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్), పాప్స్మియర్ (సర్వికల్ క్యాన్సర్ పరీక్ష), పీయూఎస్ (పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్ష), క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉచితంగా అందజేస్తారు. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ సువన్కర్ మాట్లాడుతూ.. ప్రజల్లో క్యానర్ భయాన్ని తొలగించి, సమయానికి పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కల్పించడం తమ లక్ష్యం అని తెలిపారు. వివరాలకు 040 6833 4455 సంప్రదించాలని కోరారు.