calender_icon.png 15 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

15-08-2025 01:47:14 AM

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి):రాష్ట్ర మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ 3కు గవర్నర్ ఆమోదం లభించడంతో న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ఆర్డినెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమో దం లభించింది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటు హక్కు కల్పించేలా  మున్సిపల్ చట్టంలోని సెక్షన్ సవరించారు.