26-01-2026 12:47:02 AM
సిద్దిపేట, జనవరి 25 (విజయక్రాంతి): గ్రూప్ 1,2,3,4, ఆర్‌ఆర్ బి, ఎస్‌ఐ , కానిస్టేబుల్, ఎస్.ఎస్.సి తదితర పోటీ పరీక్షలకు సిద్దిపేట ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నారని , నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని మై భా రత్, మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందంలు అన్నారు.
కరపత్రాలను సిద్దిపేట ఎస్సీ స్టడీ సర్కిల్ డై రెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ తో కలిసి ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి రూ.3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ లో tsstudycercle.co.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పిబ్రవరి 8 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 91822 20112 లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ పోగ్రాం అధికారి కిరణ్ కుమార్. అధ్యాపకులు డా సువర్ణదేవి, రమశ్రీ, తిరుపతి, లింగమూర్తి, శ్రీనివాస్, వినోద్ రామ్ కిషన్ జీ, యూత్ జిల్లా అధ్యక్షులు రాజులు పాల్గొన్నారు