26-01-2026 12:47:34 AM
ఎల్బీనగర్, జనవరి 24 : చంపాపేట డివిజన్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ వంగ మధుసూదన్ రెడ్డి(55) అంత్యక్రియలు ఆదివారం భూపేస్ గుప్తాముగిశాయి. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే చంపాపేట్ డివిజన్‌లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆయన భౌతిక దేహాన్ని ప్రజల దర్శనార్థం కర్మన్‌ఘాట్‌లోని నివాసంలో ఉంచారు. మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, స్థానికులు సందర్శించి, నివాళులర్పించారు. మధుసూదన్‌రెడ్డి అంత్యక్రియ ల సందర్భంగా మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పాడె మోసి, నివాళులర్పించారు.
నివాళులర్పించిన వారిలో మాజీ గవర్నర్ బండారు దత్తా త్రేయ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శోభా, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతోపాటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.