26-01-2026 12:45:55 AM
మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మేడ్చల్, జనవరి 25 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఓల్ ఆల్వాల్‌లో టిసిఎస్ అయాన్‌లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్షా కేంద్రాన్ని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రం వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురవడమే కాక, జామర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంటర్నెట్ పనిచేయాలందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఫాదర్ బాలయ్య నగర్ ఫేసు 1,2, రిట్రీట్ కాలనీ, తిరుమల ఎన్ క్లేవ్ ఫేస్ 1,2 వెంకటరమణ కాలనీ, చంద్రపురి కాలనీ, మహాలక్ష్మి సాయి శ్రీనివాస అపార్ట్మెంట్, ఓం శ్రీ సాయి నగర్ తదితర కాలనీల ప్రజలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానికుల ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, వివిధ కాలనీలా సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎమ్మెస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డాక్టర్ శ్రీనిధి రెడ్డి, కిషోర్, రాయప్ప రెడ్డి, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.