calender_icon.png 21 November, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్‌లో ఉచిత వైద్య శిబిరం

21-11-2025 12:59:56 AM

ఘట్ కేసర్, నవంబర్ 20 : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ యూనిట్%--%3, నీలిమా హాస్పిటల్స్ సంయుక్తంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం పురుషుల్లో ఆరోగ్య అవగాహన, ప్రారంభ నిర్ధారణ, సమగ్ర ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టబడింది.

ఈకార్యక్రమానికి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్, ఎన్ ఎస్ ఎస్ సెల్ ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేష, టి. పురుషోత్తం, ప్రోగ్రాం ఆఫీసర్ (యూనిట్ - 3) టి. పురుషోత్తం హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. వారి హాజరు పాల్గొన్న వారికి ప్రేరణనిచ్చింది. నియమిత ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యతను తెలియజేసింది. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీప ప్రాంతాల నుండి 100కి పైగా పురుషులు ఈ శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు, సూచనలను పొందారు.