calender_icon.png 24 October, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత ఎన్.ఎం.ఎం.ఎస్ ఆన్లైన్ క్లాసులు నేటి నుంచి ప్రారంభం

23-10-2025 08:19:38 PM

సూర్యాపేట (విజయక్రాంతి): అక్షర ఫౌండేషన్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో సుధాకర్ పివిసి పైప్స్, ఎస్ కె ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సూర్యాపేట వారి సౌజన్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కు ఉచిత ఆన్లైన్ కోచింగ్ నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి తెలిపారు. అక్షర ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ కోచింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఎస్ సి ఈ ఆర్ టి స్టేట్ రిసోర్స్ పర్సన్ అధ్యాపకులచే, మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయోసైన్స్, సోషల్ అంశాలపై ప్రతిరోజు 4 గంటల పాటు కోచింగ్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ స్కాలర్షిప్ టెస్టులో సెలెక్ట్ అయిన విద్యార్థులకు 48 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా ప్రాక్టీస్, మోడల్ టెస్టులు నిర్వహిస్తున్నామని పూర్తి వివరాలకు 7036259922 కు సంప్రదించాలన్నారు. ఈ ఆన్లైన్ తరగతులను తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఈ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పు నాగయ్య, రుద్రంగి కాళిదాస్, పాల్వాయి వెంకన్న,నరాల తిరుమల్ రెడ్డి, యాస శృతి, మర్రు ప్రియాంక, బత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.