23-10-2025 08:21:08 PM
గజ్వెల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం కన్నులపండుగలా నిర్వహించారు. కార్తీక మాసం రెండవ రోజు పురస్కరించుకొని నందు భక్తులచే శాస్త్ర ప్రకారం దీపారాధన ఓంకార రూపంలో జరిపించారు. దేవస్థాన పురోహితులు గోపాలకృష్ణ శర్మ కార్తీక పురాణ విశిష్టతను ఈ సందర్బంగా వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుధాకర్, ప్రధానార్చకులు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.