calender_icon.png 30 January, 2026 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనలో కుంటుపడ్డ అభివృద్ధి: హరీశ్ రావు

30-01-2026 12:11:59 AM

కేసీఆర్ హయాంలోనే సకల వసతులు

కేసీఆర్‌కు నోటీసులా? అది సూర్యుడిపై ఉమ్మి వేయడమే

అక్కెనపల్లిలో సమ్మక్క-సారలమ్మ దర్శించుకున్న హరీష్ రావు

నంగునూరు,జనవరి 29: కాంగ్రెస్ ప్రభు త్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో రైతాం గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.గురువారం నంగునూరు మండ లం అక్కెనపల్లి గ్రామంలో జరుగుతున్న స మ్మక్క-సారలమ్మ జాతరలో ఆయన పాల్గొని, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నంగునూరు మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం అక్కెనపల్లిలో మాత్రమే జరగడం ఈ ప్రాంతానికే గ ర్వకారణమన్నారు.మేడారం వెళ్లలేని భక్తులు ఇక్కడే మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.

గతంలో కనీస సౌకర్యాలు లేని ఈ గ్రామాన్ని, కేసీఆర్ హయాంలో విద్యుత్, తాగునీరు వంటి సకల వసతులతో అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు.కేసీఆర్ హయాంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం జమయ్యేదని, ఇప్పుడు నాట్లు వేసే సమయం వచ్చినా ప్ర భుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.కేసీఆర్ కట్టిన చెక్ డ్యామ్ల వల్లే నేడు వాగుల్లో నీళ్లున్నాయని, కాళేశ్వరం జలాలతో ఎండాకాలంలోనూ చెరువులు నిండాయని తెలిపారు.అభివృద్ధి కుంటుపడటం వల్లే గతంలో అక్కెనపల్లిలో ఎకరం భూమి ధర రూ. 50 లక్షలు ఉంటే,నేడు అది సగానికి పడిపోయిందని ఆరోపించారు.

సూర్యుడిపై ఉమ్మి వేయడమే..

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు ఎ త్తుతున్నందుకు తమకు,కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే.. అది సూర్యుడిపై ఉ మ్మి వేయడమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.అమ్మవారి దయతో తెలంగాణకు మ ళ్లీ మంచి రోజులు రావాలని,పంటలు బాగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు.ఈ పో తురాజు రేణుకా రమేష్,మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి,గ్రామస్తులు కిష్టారెడ్డి,నాగేం ద్రం,వెంకటేశం, సిద్దు,ఆలయ కమిటీ సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.