calender_icon.png 30 January, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరోసా కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినుల

30-01-2026 12:10:25 AM

మెదక్, జనవరి 29 (విజయక్రాంతి): మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులను తీసుకొని స్థానిక భరోసా కేంద్రాన్ని క్షేత్ర సందర్శన చేసినట్టు మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త డా.సుధారాణి తెలిపారు.  కళాశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు భరోసా కేంద్రాన్ని  సందర్శించినట్టు తెలిపారు. విద్యార్థినులను ఉద్దేశించి భరోసా కేంద్ర కో-ఆర్డినేటర్ సౌమ్య మాట్లాడుతూ భరోసా కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలనందిస్తుందో తెలిపారు.

షీ టీమ్ కో -ఆర్డినేటర్ ప్రమీల మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో స్త్రీలు, బాలికలు, గృహహింస, పని చేసే చోట లైంగిక వేధింపులు, పిల్లల అక్రమ రవాణా, విద్యాసంస్థలలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు యాసిడ్ దాడులు మొదలైన హింసల నుండి రక్షణ కల్పించడమే షీ టీమ్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి బాధిత బాలల కోసం వసతి, అవసరమైన వైద్య సేవలు అందించడం, కేసుల నమోదు చేయించి వారి సమస్యలకు పరిష్కారాన్ని అందించడమే షీ టీమ్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.ఈ క్షేత్ర సందర్శనలో కళాశాల అధ్యాపకులు డా.సి.సుధారాణి, హరిత,డా. అరుంధతి, సాయిలీల, ఉదయశ్రీ, శోభ రాణి, స్వాతి  హాబీబున్నిసా, విజయ్ PC, వెంకటయ్య ASI విద్యార్థులు పాల్గొన్నారు.