16-06-2025 11:12:57 PM
హోరాహోరీ పోటీలో అధ్యక్షుడిగా శ్రీపతి బానయ్య ఘన విజయం...
మంథని (విజయక్రాంతి): మంథనిలో ఉత్కంఠ భరితంగా సాగిన ఫ్రెండ్స్ క్లబ్ ఎన్నిక(Friends Club Election)ల్లో అధ్యక్షుడిగా శ్రీపతి బానయ్య విజయం సాధించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఫ్రెండ్స్ క్లబ్ ఎన్నికల్లో ఎక్కేటి అనంతరెడ్డి, వేల్పుల పోశం, శ్రీపతి బానయ్య అధ్యక్ష పదవికి బరిలో నిలువగా ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పోటీలో నువ్వా నేనా అన్నట్లుగా హోరహూరిగా పోటీ నెలకొంది. ఈ హోరాహోరీ పోటీలో బానయ్య కు 47 ఓట్లు రాగా, అనంత రెడ్డికి 37, పోశంకు 35 ఓట్లు పోలయ్యాయి. దీంతో 10 ఓట్ల మెజారిటీతో శ్రీపతి బానయ్య ఘన విజయం సాధించారు.
ప్రధాన కార్యదర్శిగా బరిలో ఉన్న సువర్ణ గణపతి తన ప్రత్యర్థి భీమని వెంకటస్వామి పై 26 కోట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా మందల సత్యనారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కొమురోజు శ్రీనివాస్ (క్రీడలు), మల్కా గోపాల్ రావు ( సంస్కృతిక), కోశాధికారి గా బిరుదు మధుకర్, కార్యవర్గ సభ్యులుగా రావికంటి సతీష్, మండే రాజయ్య , నరెడ్ల శ్రీనివాస్, ఆకుల రాజబాబు, గట్టు శివశంకర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులచే ఎన్నికల అధికారి ఎ.గంగాధర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తన విజయానికి సహకరించిన క్లబ్ సభ్యులకు మరియు మంత్రి శ్రీధర్ బాబుకు టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబుకు బానయ్య కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో క్లబ్బు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.