21-06-2025 12:00:00 AM
పెద్ద మందడి, జూన్ 20 : పెద్దమందడి మండల పరిధిలోని మద్దిగట్ల గ్రామంలో తమతో పాటు 2004-05 పదవ తరగతి చదువుకున్న తోటి చిన్ననాటి స్నేహితుడికి కష్టకాలంలో మిత్రులు తోడుగా నిలిచారు. మద్దిగట్ల గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న స్నేహితులు శుక్రవారం అతని ఇంటికి వెళ్లి మనోధర్యం ఉండమని, మెరుగైన వైద్యం కొరకు 21600/- ఆర్థిక సాయం అందజేశారు.. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, సాగర్ కుమార్ కృష్ణయ్య, రామ్ సాగర్ పాల్గొనడం పాల్గొన్నారు.