27-08-2025 01:11:45 AM
- సీసీ కుంట మండలంలో చెట్లను కొట్టిన ప్రాంతంలో పంచనామా
- జరిమాన విధిస్తామన్న ఎఫ్ ఆర్ ఓ అజీమ్
చిన్న చింతకుంట ఆగస్టు 26 : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని చిన్న చింతకుంట మండల పరిధిలో అమ్మపూర్ నుంచి అల్లిపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన దాదాపు కిలోమీటర్ పొడవున చెట్లను నరికివేసి వ్యాపార సముదాయ ఏర్పాటు నిమిత్తం విద్యుత్ సరఫరా తీసుకుపోయిన అధికార పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి కి నరికి వేసి విద్యుత్తు లైన్ ను తీసుకుపోయారు.
ఈ అంశంపై సంబంధిత ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు వివరణ కోరగా పంచనామ చేసామని జరిమానా విధించామని చెప్పడంతో విజయ క్రాంతి దినపత్రిక జులై 22వ తేదీన ’ కిలోమీటర్ పొడవున నరికి వేశారు’ అనే కథనం ప్రచురించింది. సంబంధిత అధికారిని పలుమార్లు ఫైన్ విధించిన చెప్పడంతో ఆ పత్రాన్ని ఇవ్వాలని కోరిన ప్రతి సారి రేపు సమర్పిస్తాం అంటూ కాలయాపన చేశారు.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పంచనామ చేయకుండానే చేసినట్లు చెబుతున్నారని విజయక్రాంతి దినపత్రిక మరో మారు ఈనెల 25 తేదీన ’ అడ్డదిడ్డంగా కొట్టిన అడిగేది ఎప్పుడో’ అనే కథనం ప్రచురితం చేసింది. ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌ఓ అజీమ్ స్పందించి ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. అంచనాలను వేసి నిబంధనలకు విరుద్ధంగా చెట్లను కొట్టిన వారికి జరిమానా విదిస్తామని సంబంధిత అధికారి తెలియజేశారు.
పంచనామా చేయడంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు అలసత్వం ప్రదర్శించారని ఎఫ్‌ఆర్‌ఓ అజీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. చెట్లను కొట్టడానికి కారణమైన వ్యక్తులు కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులుఉన్నారు.