calender_icon.png 27 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువులు సాగేదెలా?

27-08-2025 01:13:44 AM

- మొన్న పురుగుల అన్నం, తాగేందుకు బోరు నీళ్లు !

- నేడు నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకల బెడద

- అలంపూర్ గురుకులంలో దుస్థితి 

అలంపూర్ ఆగస్టు, 26:గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు,అవస్థల నడుమ చదువులు కొ నసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి.విద్యార్థులు ఒక సమస్య నుండి బయట పడేలోపే వారిని మరొక సమస్య వెంటాడుతుంది.దీంతో వారి చదువులకు తీవ్ర ఆటం కాలు ఎదురవుతున్నాయి.

పరిస్థితులు ఇలా ఉంటే యొక్క చదువులు సాఫీగా సాగేదెలా అనే సందిగ్ధంలో విద్యార్థులు పడ్డారు. గద్వాల జిల్లా ఉండవల్లి మం డలం అలంపూర్ చౌరస్తాలో ని మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల బాలుర పాఠశాల వి ద్యార్థులు వారి సంఖ్యకు సరిపడా బాత్రూంలో లేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారు.

అంతేకాక తినే అన్నంలో పురుగులు, త్రాగేందుకు బో రు నీళ్లు దిక్కయ్యాయి. స్నా నాలు చేసేందుకు నీళ్లు రాక రోజు మారితే రోజు స్నానాలు చే సే పరిస్థితులు ఎదుర్కొన్నట్లు విద్యార్థులు అధికారుల ఎదుట వాపోయారు.వీటి పరిష్కార దిశగా గత నెల విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో మరుసటి రోజు జిల్లా కలెక్టర్ బి యం సంతోష్ హాస్టల్ ను సందర్శించారు.పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నా రు.

విద్యార్థుల సమస్యలును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.దీంతో కొంత సవ్యంగా సా గుతున్న క్రమంలో మళ్లీ గత మూడు రోజులుగా విద్యార్థులకు ఎలుకల బెడద తప్పడం లేదు.రాత్రి వేళలో నిద్రపోయే విద్యార్థులను ఎలుకలు కొరకి గాయపరిచాయి. దీంతో వి ద్యార్థులు వైద్య చికిత్సల కోసం సమీపంలో ని వంద పడకల ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు.అయితే అదే హాస్టల్లో కొంతమంది విద్యార్థులు అనారోగ్యంతో వైరల్ ఫీ వర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల బారి నుం డి తప్పించి మా సదువులకు ఏలాంటి ఆటంకాలు తలెత్తకుండా సక్రమంగా సాగేందుకు చొరవ తీసుకోవాలని వాపోతున్నారు.